V6 mallanna biography books
తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు
జననం, విద్యాభాస్యం
[మార్చు]తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన 1982 జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు.
ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు.
వృత్తి జీవితం
[మార్చు]తీన్మార్ మల్లన్న ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పనిచేసి 2012లో వి6 న్యూస్లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. అనంతరం 10 టీవీలో కొంతకాలం పనిచేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]తీన్మార్ మల్లన్న వి6 న్యూస్ ఛానల్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.[1] తీన్మార్ మల్లన్న 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు.[2][3][4][5] తీన్మార్ మల్లన్న 2021 డిసెంబరు 7న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[6][7][8]
తీన్మార్ మల్లన్న 2023 నవంబర్ 8న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[9] ఆయన 2024లో జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[10][11][12][13]
పాదయాత్ర
[మార్చు]తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని 2021, జూలై 18న ఘటకేసర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించాడు.[14]
అరెస్ట్
[మార్చు]హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు 2021 ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు.[15]